Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయ వేత్త మ‌ణియ‌న్ తో ర‌జ‌నీ భేటీ.. ఈ 26 నుంచి మళ్లీ అభిమానుల‌తో స‌మావేశాలు!

  • ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని మ‌రోసారి ప్ర‌చారం
  • వ‌రుస‌గా ఆరు రోజుల పాటు అభిమానుల‌తో ర‌జ‌నీ భేటీ
  • కోడంబాక్కంలోని రాఘవేంద్ర ఫంక్ష‌న్ హాల్‌లో ముచ్చ‌టించ‌నున్న ర‌జ‌నీ
సౌతిండియా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశిస్తార‌ని మ‌రోసారి ప్ర‌చారం జోరందుకుంటోంది. ఈ రోజు ర‌జ‌నీకాంత్ చెన్నైలో ప్ర‌ముఖ‌ రాజకీయ వేత్త, రచయిత, త‌న ఆత్మీయ మిత్రుడు తమిళరువి మ‌ణియ‌న్ తో భేటీ అయ్యారు. అంతేకాదు, ర‌జ‌నీకాంత్ ఈ నెల‌ 26 నుండి 31 వరకు కోడంబాక్కంలోని రాఘవేంద్ర ఫంక్ష‌న్ హాల్‌లో తన అభిమానులతో స‌మావేశ‌మ‌య్యే కార్య‌క్ర‌మాన్ని పెట్టుకున్నారు. దీంతో ఆయ‌న అభిమానుల్లో మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. త్వ‌ర‌లోనే ర‌జ‌నీ కొత్త పార్టీ పెట్టేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.
Rajinikanth
politics
fan
fans

More Telugu News